ప్రేమ అంత ఈజీ కాదు


Sat,June 8, 2019 11:52 PM

ishq is risk movie launched telugufont news

రవిచంద్ర, యుగా యుగేష్, సాయి శ్రీవి నాయికా నాయికలుగా నటిస్తున్న చిత్రం ఇష్క్ ఈజ్ రిస్క్. రాజ్ కింగ్ దర్శకుడు. శేఖర్ మూవీస్ పతాకంపై ఎస్. చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హాస్యానికి పెద్దపీట వేస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేమ రిస్క్ అని అనుకున్నత సులువు కాదని చెబుతూనే దానికి వినోదాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మంచి టీమ్ కుదిరింది. సినిమా బాగా వస్తుందని, అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో వున్నాం అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఓ విభిన్నమైన కథకు హాస్యాన్ని జోడించి నిర్మిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. జీవా, చమ్మక్‌చంద్ర, తాగుబోతు రమేష్, నల్ల వేణు, బండ రఘు, మాధవి, జబర్దస్త్ పవన్ తదితరులు నటిస్తున్నారు.

804

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles