త్రిష తీరని కోరిక!


Mon,April 16, 2018 12:02 AM

trisha
పదహారేళ్లుగా చిత్రసీమలో రాణిస్తున్నది చెన్నై సోయగం త్రిష. అగ్ర హీరోలతో జోడీ కట్టి ఎన్నో కమర్షియల్ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినీ ప్రయాణంలో చిరస్మరణీయమైన విజయాల్ని అందుకున్న ఈ సుందరికి ఓ తీరని కోరిక ఉందట. దక్షిణాదిన దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలిసి నటించిన ఆమె ఇప్పటివరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఒక్క సినిమా చేయలేదు. ఈ విషయంలోనే తాను అంసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితుల వద్ద బాధపడిందట త్రిష. రజనీకాంత్‌తో కలిసి ఒక్క సినిమాలో నటిస్తే చాలు తన కెరీర్ పరిపూర్ణమైనట్లేనని ఆమె భావిస్తున్నదట. ఈ క్రమంలోనే రజనీకాంత్ చిత్రంలో అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందని తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..రజనీకాంత్ త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ (పిజ్జా ఫేమ్) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో నాయిక కోసం అన్వేషణ జరుగుతున్నది. ఈ చిత్రంలో ఎలాగైనా అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు త్రిష ప్రయత్నాలు తీవ్రం చేసిందని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రస్తుతం త్రిష తమిళంలో మెహిని గర్జనై సతురంగవేైట్టె-2 18 18తో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నది. నాయకి తర్వాత మరే తెలుగు చిత్రాన్ని అంగీకరించలేదు త్రిష.

3275

More News

VIRAL NEWS