గిరిజన యువతిగా...


Fri,April 12, 2019 12:28 AM

Is Nithya Menen Going To Back The Offer From RRR Team

దక్షిణాది చిత్రసీమలో వైవిధ్యమైన కథలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తుంటుంది నిత్యామీనన్. హీరోయిన్‌గా మాత్రమే నటించాలనే పరిమితులు విధించుకోకుండా నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన పాత్రలతో ప్రతిభను చాటుకుంటున్నదామె. తాజాగా ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. రామ్‌చరణ్,ఎన్టీఆర్ కథానాయకులుగా దాదాపు నాలుగు వందల కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నది. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు జీవితాలకు కాల్పానిక అంశాలను జోడించి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్ ఓ కీలక పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. గిరిజన యువతిగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆమె పాత్ర కనిపించనుందని సమాచారం. నిడివి తక్కువైనా శక్తివంతమైన పాత్ర కావడంతో దర్శకుడు రాజమౌళి ...నిత్యామీనన్‌ను ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూణేలో జరుపనున్న తదుపరి షెడ్యూల్‌లో ఆమె పాల్గొననున్నట్లు సమాచారం. అలియాభట్, అజయ్‌దేవ్‌గన్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.

2745

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles