ఆ గుర్తింపు దక్కడం నా అదృష్టం!


Fri,February 2, 2018 11:04 PM

Interview Madan Gayatri is like a re launch for Mohan Babu

Madhan
మానవ భావోద్వేగాల్ని తనదైన శైలిలో హృద్యంగా దృశ్యమానం చేస్తుంటాడు మదన్. రచయితగా, దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం గాయత్రి. మోహన్‌బాబు, శ్రియ, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా మదన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివి..

గాయత్రి ఇతివృత్తమేమిటి?

సూర్యుడు ఏడు గుర్రాల రథం మీద విశ్వవీధిలో సంచరిస్తుంటాడని మన పురాణాల్లో చెబుతారు. ఆ ఏడు గుర్రాల్లో ఒక గుర్రం పేరు గాయత్రి. ఈ ప్రపంచానికంతటికి తొలు వెలుగు సూర్యుడే. దానికి ప్రతీకగా భావిస్తూ ఈ టైటిల్‌ను ఎంపిక చేసుకున్నాం. ఒక్కోసారి మనం ఇష్టపడ్డవాళ్లనే ద్వేషించాల్సిన పరిస్థితి తలెత్తుతుందనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించాం. ఓ తండ్రీకూతురు కథ ఇది. ఇద్దరి మధ్య అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో నడుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠమైన మలుపులతో సాగుతుంది. మహిళ ఔన్నత్యానికి దర్పణంలా ఉంటుంది.

మోహన్‌బాబు వంటి మాస్ హీరోకు గాయత్రి అనే సాఫ్ట్ టైటిల్ పెట్టడానికి కారణమేమిటి?

lఓ కథను మనం ఏ విధంగా ఆవిష్కరిస్తున్నామనే అంశం ఆధారంగానే ప్రేక్షకులు టైటిల్‌ను స్వీకరిస్తారు. కథానుగుణంగానే టైటిల్ పెట్టాం. సినిమా చూస్తే టైటిల్ పక్కాగా కుదిరిందంటారు.

మోహన్‌బాబు పాత్ర చిత్రణలో పెదరాయుడు ఛాయలు కనిపిస్తాయంటున్నారు?

ఆ సినిమాతో ఎలాంటి సంబంధం వుండదు. గాయత్రిలో మోహన్‌బాబు పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుంది. గతంలో ఎప్పుడూ చూడని శైలిలో వుంటుంది.

మోహన్‌బాబుగారిని డైరెక్ట్ చేయడం ఎలాంటిఅనుభూతినిచ్చింది?

మోహన్‌బాబుగారు మహానటుడు. ఏ పాత్ర చేసినా తనదైన హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. కొదమసింహంలో చక్కటి హాస్యంతో మెప్పించిన ఆయనే అసెంబ్లీ రౌడీలో శక్తివంతమైన పాత్రకు ప్రాణం పోశాడు. భిన్న పార్శాల్లో నటుడిగా ఆవిష్కరించుకోవడం ఒక్క మోహన్‌బాబుగారికే సాధ్యమైంది. యస్వీరంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీగణేషన్ వంటి మహానటుల పరంపరకు చెందినవారు మోహన్‌బాబు. అందుకే ఈ సినిమా విషయంలో ఎక్కడా పొరపాటు చేయొద్దనిచాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఓ గొప్ప నటుణ్ణి డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

పదేళ్ల కెరీర్‌లో కేవలం ఐదు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారెందుకని?

అలా జరిగిపోయిదంతే. నేనెప్పుడు ఏదీ ప్లాన్ చేసుకోను. తక్కువ సినిమాలు చేసినా దర్శకుడిగా ప్రేక్షకుల్లో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.

సినిమాలో శ్రియ పాత్ర ఎలా వుంటుంది?

శ్రియ గొప్ప పర్‌ఫార్మర్. మనం, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల్లో ఆమె అద్భుతాభినయాన్నిప్రదర్శించింది. ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది. విష్ణు, శ్రియ పాత్రలు సినిమాకు మూలస్తంభాలుగా ఉంటాయి.

తదుపరి సినిమా గురించి?

ఈ ఏడాది తప్పకుండా మరో చిత్రం చేస్తాను. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాను.

1865

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles