కల్యాణం కమనీయం


Mon,March 11, 2019 12:56 AM

Inside Sayyeshaa Segal And Arya Pre Wedding Bash With Allu Arjun Suriya And Jyothika

తమిళ హీరో ఆర్య, నటి సయేషా సైగల్ వివాహ బంధంతో ఆదివారం ఒక్కటయ్యారు. ఇటీవల ప్రేమికుల రోజు సందర్భంగా తమ ప్రేమ వివాహంపై ట్విట్టర్ వేదికగా ఆర్య, సయేషా వెల్లడించిన విషయం తెలిసిందే. ఆదివారం వీరి వివాహం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి ముందు నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ నటులు సంజయ్‌దత్, ఆదిత్య పంచోలి, ఖుషి కపూర్‌తో పాటు పలువురు బాలీవుడ్ తారలు పాల్గొని సందడి చేశారు. సాయేషా గులాబీ రంగు లెహెంగాలో మెరిసింది. తన సన్నిహితులతో కలిసి సంగీత్‌లో ఉత్సాహంగా స్టెప్పులేసింది. గాయని ప్రీతీ భల్లా బాలీవుడ్ గీతాల్ని ఆలపించి ఆకట్టుకున్నారు. శనివారం నిర్వహించిన సంగీత్‌లో ఆర్య, సయేషాలకు సన్నిహితులైన పలువురు దక్షిణాది తారలు పాల్గొన్నారు. సంగీత్ వేడుకలో హీరో అల్లు అర్జున్ పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

2027

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles