తొలిసారి స్వీయగళంతో..


Fri,November 9, 2018 12:09 AM

Ileana dubs in Telugu for Amar Akbar Anthony Movie

మన కథానాయికలు వెండితెరపై సొంత గళాన్ని వినిపించడం కొత్తేమి కాదు. గత కొన్నేళ్లుగా అగ్ర నాయికలందరూ అరువు గొంతుకు స్వస్తిపలికి స్వీయగళాన్ని వినిపించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఛార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్, సమంత, కీర్తిసురేష్ వంటి తారలు సొంతంగా డబ్బింగ్ చెబుతూ అభిమానుల్ని అలరిస్తున్నారు. ఈ జాబితాలో గోవా భామ ఇలియానా చేరింది. తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోనిలో ఈ అమ్మడు తెలుగులో డబ్బింగ్ చెబుతున్నది. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేస్తున్న ఇలియానా ఈ సినిమాపై ఎన్నో ఆశల్ని పెట్టుకుంది. తెలుగులో ఈ సొగసరి తొలిసారి డబ్బింగ్ చెబుతుండటం మరో విశేషం. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 16న విడుదలకానుంది. రవితేజ-ఇలియానా కలయికలో వస్తున్న నాలుగో చిత్రమిది. దీంతో ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ నెల 10న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు.

ఈ చిత్రం తనకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందనే విశ్వాసంతో ఉంది ఇలియానా. ఇందులో రవితేజ అమర్ , అక్బర్, ఆంటోనిగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అధికభాగం అమెరికాలో చిత్రీకరణ జరిపారు. సునీల్, లయ, వెన్నెలకిషోర్, రవిప్రకాష్, తరుణ్‌అరోరా, ఆదిత్యమీనన్, అభిమన్యుసింగ్, విక్రమ్‌జిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి, సహనిర్మాత: ప్రవీణ్ మర్పురి, సంగీతం: తమన్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

1604

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles