చిరుకు జోడీగా?


Thu,September 5, 2019 11:36 PM

Ileana D Cruz to star opposite Chiranjeevi in Koratala Siva s upcoming film Find out

కెరీర్ తొలినాళ్లలో యువతరం కలల రాకుమారిగా భాసిల్లింది ఇలియానా. తెలుగులో చక్కటి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న ఈ సొగసరి కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ అభినయప్రధాన పాత్రల్లో మెప్పించింది. ఐదేళ్ల విరామం తర్వాత గత ఏడాది అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తాజా సమాచారం ప్రకారం ఇలియానా తెలుగు మరో భారీ చిత్రంలో కథానాయికగా ఖరారైనట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే... చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.

ఇందులో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతున్నది. కాజల్ అగర్వాల్, అనుష్క పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇలియాన హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తున్నది. ఇటీవలే చిత్ర బృందం ఇలియానాను కలిసి కథ వినిపించిందని, చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడి సినిమా కావడంతో వెంటనే ఆమె అంగీకరించిందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఇలియానా హిందీలో పాగల్‌పంతీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలకాలంలో సినిమాలకంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నదీ సుందరి. ప్రియుడు ఆండ్రూనీబోన్‌తో సుదీర్ఘ ప్రేమబంధానికి ఇలియానా గుడ్‌బై చెప్పిందనే వార్త బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

1704

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles