ఇది నా సెల్ఫీ గీతాలు


Sun,October 14, 2018 01:52 AM

Idi Naa Selfie Movie Audio Launch

శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది నా సెల్ఫీ. నువ్వుల వినోద్, ఆరోహి (అనురాధ) జంటగా నటిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో ప్రభాకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ చక్కటి ఎమోషన్స్‌తో పాటలన్నీ బాగున్నాయి. కథానుగుణంగా బాగా కుదిరాయనుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. సెల్ఫీల వల్ల జరిగే అనర్థాలు, సెల్ఫీల జ్ఞాపకాల్ని తీసుకొని చేసిన సినిమా ఇది. సమాజానికి మంచి సందేశాన్నందిస్తుంది. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది అని దర్శకుడు చెప్పారు. విభిన్న కథాచిత్రంలో నటించడం పట్ల నాయకానాయికలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో సానియా, అనూష, కె.శ్రీనివాసరావు, పి.సుబ్బారెడ్డి తదితరులు నటిస్తున్నారు.

731

More News

VIRAL NEWS

Featured Articles