ఇద్దరి పోరాటం


Wed,March 20, 2019 11:55 PM

iddaru movie official teaser release

అర్జున్, జె.డి చక్రవర్తి, రాధికా కుమారస్వామి, కె. విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇద్దరు. ఎఫ్.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఫరీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. సమీర్ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ కోట్ల రూపాయల ఆస్తి కోసం ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. మైండ్‌గేమ్ ప్రధానంగా సాగుతుంది. హృద్యమైన ప్రేమకథకు యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలను జోడించి రూపొందించాం అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు తర్వాత అర్జున్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. ఆయనపై తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెలలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదలచేస్తాం అని తెలిపారు. ఫైజల్‌ఖాన్, అశోక్‌కుమార్, సోనీ చరిష్టా, సమీర్, రామ్‌జగన్, గగన్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:అమీర్‌లాల్, సంగీతం: సుభాష్ ఆనంద్.

901

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles