నిహారికకు అన్నయ్యగా వచ్చాను!


Mon,March 25, 2019 03:26 AM

IAm Niharika Big Brother Said Vijay Devarakonda

గీత గోవిందం చిత్రంలో నేను నాగబాబు కొడుకు పాత్రలో నటించాను. ఆయనతో పనిచేస్తున్నప్పుడు నాన్నతో ఉన్నాననే భావన కలిగింది. షూటింగ్ సమయంలో ఏమో అనుకున్నాను కానీ..నువ్వు మంచోడివేనయ్యా అని నాగబాబుగారు నన్ను మెచ్చుకున్నారు. అందుకే నిహారికకు అన్నయ్యగా ఈ వేడుకకు వచ్చాను అన్నారు విజయ్ దేవరకొండ. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సూర్యకాంతం చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్‌నరేష్ నిర్మాతలు. చిత్ర తొలి టికెట్‌ను విజయ్ దేవరకొండకు నిహారిక బహుమతిగా ఇచ్చింది. ఆడియోను విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సినిమా టీజర్ చాలా బాగుంది.

హీరో రాహుల్ విజయ్ నాన్న ఓ సినిమాలో నా ఫైట్‌కు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ నిర్మాతలు నా అర్జున్‌రెడ్డి చిత్రాన్ని అమెరికాలో విడుదల చేశారు. నా ఆత్మీయులు ఎందరో పనిచేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు. టీజర్ చూడగానే థ్రిల్‌గా ఫీలయ్యానని, ఉభయ తెలుగు రాష్ర్టాల్లో సినిమాను తమ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నామని దిల్‌రాజు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ దిల్‌రాజుగారికి ఈ సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది. వరుణ్‌తేజ్ నాకు మార్గదర్శిలాంటివారు. సూర్యకాంతం పాత్రలో నిహారిక అద్భుతంగా నటించింది. ఆహ్లాదకరమైన కథతో అందరికి నచ్చే చిత్రమిది అన్నారు. ఈ సినిమాకు రాబిన్ చక్కటి స్వరాల్ని అందించాడు. దర్శకుడు ప్రణీత్ చేసిన ముద్ద్దపప్పు ఆవకాయ వెబ్‌సిరీస్ బాగా నచ్చింది.

అది చూసి ఈ సినిమా అవకాశమిచ్చాం. ఆద్యంతం వినోదప్రధానంగా అందరికి అలరించే చిత్రమిది అని నిర్మాతల్లో ఒకరైన సందీప్ చెప్పారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ఈ సినిమా బాగా రావడానికి మా అన్న వరుణ్‌తేజ్ కారణం. సినిమాలో ప్రతి పాత్రకు తగిన ఆర్టిస్టులు లభించారు. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది అని చెప్పింది. సూర్యకాంతం పాత్రకు నిహారిక చక్కగా సరిపోయిందని, సినిమాలో తాను అభి అనే పాత్రను పోషిస్తున్నానని రాహల్ విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైట్‌మాస్టర్ విజయ్, కాలభైరవ, మార్క్, కల్వకుంట్ల తేజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

3218

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles