ఆత్మగౌరవం కోసం


Tue,May 14, 2019 01:11 AM

i will impress with swayam vedha movie posani krishna murali

ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటిస్తున్న చిత్రం స్వయంవద. వివేక్ వర్మ దర్శకత్వం వహించారు. రాజా దూర్వాసుల నిర్మించారు. ఈ నెల 17న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ జానపద కథల్లో కనిపించే నాటకీయత, వాస్తవికతను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన చిత్రమిది. ఆత్మగౌరవం కోసం స్వయంవద అనే యువతి సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. కథానాయిక పాత్ర ఆరు విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తుంది. వాణిజ్య హంగులు పుష్కలంగా ఉంటాయి. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. అర్చన, పోసాని కృష్ణమురళి, ధన్‌రాజ్, రాంజగన్, లోహిత్‌కుమార్ కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమణ జీవీ, కెమెరా: వేణు మురళీధర్.

613

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles