Telangana Intermediate 1st & 2nd Year Results 2019

మా పరువును బజారుపాలు చేయొద్దు


Wed,March 20, 2019 12:02 AM

i will give return gift to nagababu says sivaji raja

గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో రాజకీయాలకు తావుండేదికాదని, నాలుగేళ్లుగా అవి ఎక్కువైపోయాయని అన్నారు మా తాజా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా. తప్పులు తమ దగ్గర పెట్టుకొని నరేష్, జీవిత ఎదుటివారిని వేలెత్తిచూపుతున్నారని ఆరోపించారు. నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయకుండా శివాజీరాజా అడ్డుకుంటున్నారని ఇటీవలే అధ్యక్షుడు నరేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంగళవారం హైదరాబాద్‌లో శివాజీరాజా స్పందిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్టం ప్రకారం మార్చిలో ఎన్నికలు జరగాలి. ఏప్రిల్‌లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయాలి. నేను అలాగే పదవి చేపట్టాను. ఆ వాస్తవాలు తెలుసుకోకుండా నూతన ప్యానల్ ప్రమాణస్వీకారానికి నేను అడ్డుపడుతున్ననంటూ అబద్ధ్దాలు ఆడుతున్నారు.

వారి వ్యాఖ్యలు నన్ను బాధించాయి. అసోసియేషన్ సమస్యను ప్రజలందరి ముందు ఉంచడం సరికాదు. మా పరువును బజారుపాలు చేయొద్దు. నాపై చేసిన ఆరోపణల్ని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. కొత్తగా ఎన్నికైన ప్యానల్‌కు ఏ అవసరం వచ్చినా సహాయం అందిస్తాను. 26 మంది ఏకతాటిగా ఉంటారని నమ్ముతున్నాను. అధ్యక్షుడు, సెక్రటరీ హుందాగా ప్రవర్తించాలి. పదవులకు ఉన్న గౌరవాన్ని కాపాడాలి. ఎన్నికల ముందు నాగబాబు నాకు గిఫ్ట్ ఇచ్చారు. తప్పకుండా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని తెలిపారు.

2046
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles