జీరో నుండి మొదలుపెట్టాను!


Wed,March 13, 2019 12:00 AM

I Love You Movie Trailer Launch Full Event

ఇప్పటికీ యువకుడిగా కనిపిస్తున్నారు మీ సీక్రెట్ ఏమిటని అందరూ అడుగుతున్నారు. నేను ప్రతీది జీరో నుండి మొదలుపెట్టాను. మన దగ్గర ఏమి లేనప్పుడే సృజనాత్మకతతో ఆలోచిస్తాం. నా సినిమాలోని ఇతివృత్తాలు, సన్నివేశాలు వైవిధ్యంగా ఉండటానికి ఆ జీరోనే కారణం అని అన్నారు ఉపేంద్ర. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఐ లవ్ యూ. నన్నే ప్రేమించు ఉపశీర్షిక. రచితా రామ్ కథానాయిక. ఆర్.చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత దిల్‌రాజు విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో పెళ్లిపందిరి, తొలిప్రేమ చిత్రాలకు పంపిణీదారుడిగా పనిచేశాను. ఆ సమయంలో విడుదలైన ఉపేంద్ర సినిమాల్ని చూసి ఇలాంటి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారా అనుకున్నాను.

ఆర్య సినిమా చేయాలని అనుకున్నప్పుడు ఉపేంద్ర సినిమాలు చూశా. బోల్డ్, నెగెటివ్ శైలిలో సాగే పాత్రల్ని ఎలా జనరంజకంగా తెరపై ఆవిష్కరించాలో ఆయన సినిమాలు చూసిన తర్వాతే అర్థమైంది అని అన్నారు. ఉపేంద్ర మాట్లాడుతూ రాజకీయాలు వ్యాపారంగా మారడంతో 20 శాతం మంది నాయకులు 80 శాతం మంది సామాన్యులపై అధికారం చెలాయిస్తున్నారు. ఆ ధోరణిలో మార్పు రావాలనే రాజకీయ పార్టీని స్థాపించాను అని పేర్కొన్నారు. అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 సినిమాలు కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ఈ తరహా కథాంశాలతో ఉప్రేంద చాలా ఏళ్ల క్రితమే సినిమాలు చేశారు. అందరూ ఇప్పుడు ఆయన్ని అనుసరిస్తున్నారు. నేటి ట్రెండ్‌కు తగిన కొత్త తరహా ప్రేమకథ ఇది. ఉపేంద్ర ఈ కథ విని మరో గీతాంజలి అవుతుందని చెప్పారు. ప్రేమ, సెక్స్ మధ్య ఉండే వ్యత్యాసాన్ని అర్థవంతంగా ఆవిష్కరించే చిత్రమిది అని దర్శకనిర్మాత చంద్రు తెలిపారు. రూల్స్‌ని బ్రేక్ చేస్తూ ప్రతిసారి కొత్త కథలతో ఉపేంద్ర సినిమాలు చేస్తుంటాడని వైవీయస్ చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీధర్, సుధాకర్ కోమాకుల, సంజన తదితరులు పాల్గొన్నారు.

1184

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles