ఒక్క సినిమా చాలు..

Wed,October 23, 2019 12:51 AM

గత కొంతకాలంగా గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటున్నది రెజీనా. ప్రయోగాలకు ప్రాముఖ్యతనిస్తూ సినిమాలు చేస్తున్నది. తెలుగులో రూపొందిన ‘అ!’, ‘ఎవరు’ చిత్రాల్లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రల్లో విలక్షణ అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసల్ని అందుకున్నది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో తన ఆలోచన విధానం పూర్తిగా మారిందని, ఎన్ని సినిమాలు చేస్తున్నాననే దానికంటే ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నానన్నదే తనకు ముఖ్యమని చెబుతున్నది. రెజీనా మాట్లాడుతూ ‘కెరీర్‌ తొలినాళ్లలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసినప్పుడే చిత్రసీమలో నిలదొక్కుకుంటామనే అభిప్రాయం ఉండేది. లేదంటే ప్రేక్షకులు నన్ను మర్చిపోతారని అనుకునేదాన్ని. విరామం తీసుకుంటే అవకాశాలు రావేమోనని కథలు నచ్చకపోయినా చాలా సినిమాలు చేశాను. ఇప్పుడా భయాలన్నీ తొలగిపోయాయి. ఏడాదికి ఒకటైనా నా మనసుకు నచ్చిన సినిమా చేస్తే చాలనుకుంటున్నాను. పారితోషికం, పేరుప్రఖ్యాతుల కంటే ఆ పాత్ర నుంచి కొత్తగా ఏం నేర్చుకున్నాను, నటిగా నాలో ఎంతవరకు పరిణితికి ఉపయోగపడిందో చూసుకుంటున్నాను. ఆ సంతృప్తి నాకు ఎక్కువ ఆనందాన్నిస్తున్నది’ అని తెలిపింది.

415

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles