సమంతకు నేను పెద్ద ఫ్యాన్‌ని!


Fri,October 13, 2017 12:01 AM

I Am Big Fan Of Samantha Nagarjuna Raju Gari Gadhi 2

nagsam
రాజుగారి గది-2 చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. కొద్దిరోజుల క్రితమే సమంత-చైతన్య పెళ్లయింది. సమంత ఇంటికోడలిగా వచ్చింది. పెళ్లయిన తర్వాత సమంత మా ఇంటికి హిట్ తీసుకొచ్చిందని అందరూ చెప్పుకోవాలి అన్నారు నాగార్జున. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రాజుగారి గది-2. సమంత, సీరత్‌కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ దర్శకుడు. నేడు ప్రేక్షకులముందుకొస్తున్నది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా విజయంపై నాకు పూర్తి విశ్వాసముంది. నిర్మాత పీవీపీ కొన్ని కొత్త దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు అన్నారు. సినిమా ైక్లెమాక్స్ ఘట్టాల్లో సమంత మిమ్మల్ని డామినేట్ చేసిందట కదా అనే ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ నేను సమంతాకు పెద్ద ఫ్యాన్‌ని. ఏ మాయ చేశావే సినిమా చూడగానే సమంతకు ఫోన్ చేసి ..సామ్ బాగా చేశావు. నేను నీకు ఫ్యాన్‌నైపోయా అని అభినందించాను అన్నారు. సమంత మాట్లాడుతూ ఈ సినిమాలో నాది చిన్న పాత్ర అయినా దాని ప్రభావం శక్తివంతంగా వుంటుంది.

ఏడుస్తూ నటించిన సన్నివేశాల్లో గ్లిజరిన్ వాడాల్సిన అవసరం రాలేదు. అంతగా నన్ను కదిలించిన పాత్ర ఇది అని చెప్పింది. అక్కినేని ఇంటికోడలిగా రావడం ఎలాంటి అనుభూతినిస్తుందని అడిగినప్పుడు చైతన్య, నేను ఎనిమిదేళ్లుగా స్నేహితులం. నేను నా బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లాడాను. ఇప్పుడు నేను అక్కినేని సమంతను. ఎంతో పేరున్న, శక్తివంతమైన కుటుంబ సభ్యురాలిగా నాపై బాధ్యత పెరిగింది. అక్కినేని కుటుంబంలో మహిళల్ని పురుషలతో సమానంగా చూస్తారు. స్వతంత్రంగా ఎదగడానికి స్వేచ్ఛనిస్తారు. అమల, సుప్రియను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అలాంటి ఇంటి కోడలిని కావడం గొప్ప వరంగా భావిస్తున్నాను అని చెప్పింది. ఓంకార్ మాట్లాడుతూ మూడో చిత్రానికే నాగార్జునవంటి పెద్ద హీరోని డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు జీవితాంతం రుణపడి వుంటాను. అందరి నమ్మకాన్ని నిలబెట్టే చిత్రమిది అన్నారు. నాగార్జునతో తమ సంస్థకిది మూడో చిత్రమని..తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందన్న విశ్వాసముందని పీవీపీ పేర్కొన్నారు. చైతన్య-సమంతల రిసెప్షన్ తేదిని త్వరలో తెలియజేస్తానని, హైదరాబాద్‌లోనే ఆ వేడుకను నిర్వహిస్తామని నాగార్జున వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

1159

More News

VIRAL NEWS

Featured Articles