ఊహించని విజయమిది!

Tue,February 5, 2019 11:36 PM

తొలి పాట రిలీజ్ రోజునే సినిమా బాగుందని, ఆడేలా వుందని చెప్పాను. నిజంగానే సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఈ రోజుల్లో సినిమా ఆడేదే కష్టం. అలాంటిది 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు దిల్ రాజు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్, దినేష్ తేజ్, ప్రియా వడ్లమాని, దీక్ష, హేమ ఇంగ్లే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హుషారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో 50 డేస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత దిల్ రాజు చిత్ర బృందానికి జ్ఞాపికల్ని అందజేశారు. అనంతరం బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ హుషారు చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ స్థాయి విజయాన్ని నేను ఊహించలేదు.

కొన్ని ఏరియాల్లో షిఫ్టింగ్‌తో..హైదరాబాద్‌లోని శ్రీమయూరి థియేటర్‌లో ఫుల్ రన్‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది. శ్రమిస్తే ఫలితం దక్కుతుందనడానికి మా సినిమా విజయమే నిదర్శనం. ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటు శ్రమించాం. దర్శకుడు శ్రీహర్ష చాలా ఓపికగా ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని రూపొందించాడు అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ రోజు ఓ జ్ఞాపకమే. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూసి భారీ విజయాన్ని అందించారు అని దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి అన్నారు. ఈ కార్యక్రమంలో తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్, దినేష్ తేజ్, ప్రియా వడ్లమాని, దీక్ష, హేమ తదితరులు పాల్గొన్నారు.

2182

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles