Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ప్రేమికుల హల్‌చల్


Tue,March 19, 2019 11:32 PM

hulchul its an another crime comedy thriller from tollywood

రుద్రాక్ష్, ధన్యబాలకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం హల్‌చల్. శ్రీపతి కర్రి దర్శకుడు. శ్రీరాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై గణేష్ కొల్లూరి నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదలకానుంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఆద్యంతం చక్కటి వినోదంతో అలరిస్తుంది. కథానుగుణంగా టైటిల్ కుదిరింది. ఓ జంట ప్రేమ ప్రయాణంలో ఎదుర్కొన సంఘటనలు ఏమిటన్నది ఆసక్తిగా ఉంటుంది. సంగీత దర్శకులు హనుమాన్, భరత్ మంచి స్వరాలను అందించారు. రాజ్‌తోట సినిమాటోగ్రఫీ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. కృష్ణుడు, మధునందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌తోట, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, రచన-దర్శకత్వం: శ్రీపతి కర్రి.

1416

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles