ప్రేమకు వంతెన


Thu,October 12, 2017 11:52 PM

rahulravi
గోడ, బ్రిడ్జ్ (వంతెన) ఒకే పదార్థంతో తయారవుతాయి. కానీ గోడ మనుషుల్ని విడదీస్తుంది. బ్రిడ్జ్ మనుషుల్ని కలుపుతుంది. ఇదే హౌరా బ్రిడ్జ్ కథాంశం అన్నారు రేవన్ యాదు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం హౌరా బ్రిడ్జ్. రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలి రాథోడ్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. ఈఎంవీఈ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ బాగుందని పలువురు చిత్ర ప్రముఖులు ఫోన్ చేసి నన్ను అభినందించారు. ప్రేమికుల భావోద్వేగభరిత ప్రయాణానికి దృశ్యరూపంగా సాగే చిత్రమిది. హృదయాన్ని స్పృశించే అంశాలుంటాయి. రాహుల్వ్రీంద్రన్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది అన్నారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. అన్ని కమర్షియల్ అంశాలుంటాయి అని రాహుల్వ్రీంద్రన్ చెప్పారు. కథానుగుణంగా చక్కటి బాణీలతో పాటలు కుదిరాయని త్వరలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర తెలిపారు. నటనకు ఎంతగానో ప్రాధాన్యత వున్న పాత్రలు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని కథానాయికలు ఆనందం వ్యక్తం చేశారు. రావు రమేష్, అజయ్, అలీ, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌మిశ్రా, సంగీతం: శేఖర్‌చంద్ర, మాటలు: శ్యామ్, సాహిత్యం: శ్రీమణి, భాగ్యలక్ష్మి, పూర్ణాచారి, కరుణాకర్, రచన-దర్శకత్వం: రేవన్ యాదు.

214

More News

VIRAL NEWS