మాఫియాడాన్ ఎవరు?


Tue,April 16, 2019 11:49 PM

Hitech Killer movie release on May 1

బల్వాన్, శ్రావణి జంటగా నటిస్తున్న చిత్రం హైటెక్ కిల్లర్. మజ్నుసాహెబ్ మూవీస్, సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకాలపై మజ్ను రెహాన్ బేగం నిర్మిస్తున్నారు. ఎస్.ఎం.ఎం ఖాజా దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిది. సంఘవిద్రోహ శక్తిగా మారిన ఓ మాఫియాడాన్ చివరకు పోలీసుల చేతులో ఎలా అంతమయ్యాడన్నది ఆసక్తిని పంచుతుంది. యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్‌తో అందరిని అలరిస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. టాకీపార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్‌మిగిలిన రెండు పాటల్ని త్వరలో చిత్రీకరించనున్నాం. ఇటీవల విడుదలైన గీతాలకు మంచి స్పందన లభిస్తున్నది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆటోవాలా... పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. జాతీయ బాడీ బిల్డర్ బల్వాన్‌పై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు అలరిస్తాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా హీమాన్ పేరుతో మరో చిత్రాన్ని రూపొందిస్తాం అని తెలిపారు. సత్యప్రకాష్, అన్నపూర్ణమ్మ, జీవా, కవిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, సంగీతం: ఎస్.కె. మజ్ను.

784
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles