డబ్బే జీవితం కాదు

Thu,November 7, 2019 11:07 PM

మన్నారా చోప్రా కథానాయికగా నటిస్తున్న చిత్రం హై 5. అమ్మ రాజశేఖర్ దర్శకుడు. రాధరాజశేఖర్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో మన్నారా చోప్రాపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ జీవితంలో డబ్బే ప్రధానం కాదు. కుటుంబం, సుఖసంతోషాలే ముఖ్యమనే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిది. చక్కటి సందేశంతో ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. కథానుగుణంగా 12 పాటలుంటాయి. తమన్‌తో పాటు విదేశీ సంగీత దర్శకులు బాణీలను సమకూర్చుతున్నారు. గురువారంతో చిత్రీకరణ పూర్తయింది అని తెలిపారు. నృత్యప్రధాన సినిమాలో నటించాలనే తన కల ఈ సినిమాతో తీరిందని మన్నారా చోప్రా చెప్పింది. జనవరిలో ఈ సినిమాను విడుదలచేయనున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. జాస్మిన్, ఛాయా, ప్రణాళి, సమీర్, సెల్వరాజ్ ప్రధాన పాత్రల్లో న టిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ముజీర్ మాలిక్, సంగీతం: తమన్, డాడిషాక్, పునీత్‌రాజా, జేడీజాన్.

523

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles