Telangana Intermediate 1st & 2nd Year Results 2019

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్


Wed,March 20, 2019 12:09 AM

High Court Gives Green Signal To Laxmi's NTR Movie

దివంగత ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి తెలంగాణ హైకోర్ట్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రతీ వ్యక్తికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, చట్టానికి లోబడి ఎవరైన దానిని వ్యక్తీకరించుకునే వీలుంటుందని కోర్టు అభిప్రాయపడింది. సినిమాలో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలలో ఎలాంటి ఇబ్బంది లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. దీంతో చిత్ర విడుదలకు మార్గం సుగమం అయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

2799

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles