జూనియర్ లవ్‌స్టోరీ


Tue,July 9, 2019 11:57 PM

Hey Junior Chitra o First Look Poster Released

వ్యాంకిష్ మీడియా పతాకంపై ఆయుష్, షిరిన్, ప్రమోదిని, మణిచందన ముఖ్యతారలుగా రవికుమార్ పొన్నగంటి దర్శకత్వంలో షేక్ గౌస్ నిర్మిస్తున్న చిత్రం . ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మా చిత్ర ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన పోచారం శ్రీనివాసరెడ్డికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పూర్తిగా యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల మెప్పు పొందే ఉద్వేగాలు కూడా వున్నాయి. వచ్చే వారంలో టీజర్‌ను విడుదల చేసి, ఆగస్టు మొదటివారంలో పాటలను, అదే నెల చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చక్కటి టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. అసభ్యతకు తావు లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ చిత్రం వుంటుంది అని తెలియజేశారు. మున్ని, అనిత, డా.మండవ శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమ్మపండు, సహ నిర్మాతలు: చేపూరి చంద్రకాంత్, పులిషేరి ప్రణదీప్, సమర్పణ: సబీనా.

841

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles