అక్షర సమరం!

Sat,March 23, 2019 10:31 PM

చదువుల ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫీజులు కట్టలేక అప్పుల పాలైన తల్లిదండ్రులు..ఇలాంటి వార్తలు తరచూ చూస్తుంటాం. అందుకు కారణం అక్షరం అంగడి సరుకు కావడమే. విద్య వ్యాపారమైంది. ఇది తప్పని ఎవరికి వారు భావిస్తుంటారే కానీ దాన్ని మార్చడానికి మాత్రం ప్రయత్నించరు. కానీ ఓ యువతి విద్యా వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుడుతుంది అన్నారు బి.చిన్నికృష్ణ. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అక్షర. నందితశ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సురేష్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ వివేకాన్ని ఇవ్వవలసిన విద్య వ్యాపారంగా మారితే ఆ వ్యవస్థ ఎంత దారుణంగా మారుతుందనేది అందరికి తెలుసు. తెలిసి ఉదాసీనంగా ఉండేవారిని సైతం ప్రశ్నిస్తూ అక్షర అనే యువతి సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలోని అక్షర థీమ్ సాంగ్‌ని విడుదల చేశాం. ఈ పాటను చైతన్య ప్రసాద్ రాశారు.అసులదర..నిశలు చెదర..అక్షరాగ్ని శిఖలు ఎగిసి ఆగ్రహించెలె అంటు సాగే పాట ఈ ఏడాదికే ఉత్తమ గేయంగా నిలుస్తుందన్న నమ్మకముంది. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అన్నారు.

1023

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles