ఈ మనసే.. రీమిక్స్ చూసి పవన్ అభినందించారు!

Thu,December 5, 2019 12:14 AM

‘భిన్న ధృవాల్లాంటి ఓ జంట ప్రేమకథకు అందమైన దృశ్యరూపమిది. కుటుంబ విలువలు, ప్రేమ, క్రీడా నేపథ్య ఇతివృత్తంతో నవ్యమైన అనుభూతిని పంచుతుంది’ అని అన్నారు ఉదయ్‌శంకర్. ‘ఆటగదరా శివ’ చిత్రంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రతో తొలి అడుగులోనే కథానాయకుడిగా ప్రశంసల్ని అందుకున్నారాయన.ఉదయ్‌శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్‌మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఎన్.వి.నిర్మల్‌కుమార్ దర్శకుడు. ఈ నెల 6న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో హీరో ఉదయ్‌శంకర్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..


కమర్షియల్ హీరోగా పేరుతెచ్చుకోవాలనే యాక్షన్, పాటలున్న ఈ కథను ఎంచుకున్నారా?

కథ నా దృష్టిలో అసలైన హీరో. కథ బాగుం సినిమాకు, హీరోకు పేరొస్తుంది. ‘ఆటగదరాశివ’ తర్వాత ప్రేమకథతో సినిమా చేయాలని ఆరేడు నెలల పాటు చాలా కథలు విన్నాను. ఆ సమయంలో రచయిత భూపతిరాజా ‘మిస్‌మ్యాచ్’ పాయింట్ వినిపించారు. నాకు చాలా నచ్చింది. తండ్రీకూతుళ్లు, తల్లీకొడుకుల అనుబంధంతో పాటు వాణిజ్య హంగులు, ప్రేమ, భావోద్వేగాల కలబోతగా సినిమా ఉంటుంది.

‘మిస్ మ్యాచ్’ అని ఎవరూ తెరపై అంటారు?

భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ ప్రేమజంట కథ ఇది. సినిమాలో ఐటీ ఉద్యోగిగా నా పాత్ర వినూత్నంగా ఉంటుంది. జీవితంలో క్రమశిక్షణకు విలువనిచ్చే యువకుడిగా కనిపిస్తాను. తన వ్యక్తిత్వానికి భిన్నమైన కుస్తీ క్రీడాకారిణితో ప్రేమలో పడతాడు. ఆ జంట ప్రేమాయణం ఏ విధమైన మలుపులు తిరిగిందన్నది తెరపై ఆకట్టుకుంటుంది.

మీ నిజజీవితంతో హీరో పాత్రకు ఏమైనా పోలికలు ఉంటాయా?

తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే నంబర్స్ మెమోరీలో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాను. గణితంలోని ‘పై’ అంకెలను పదివేల వరకు మెమోరైజ్‌చేసి లిమ్కాబుక్‌లో స్థానాన్ని సంపాదించుకున్నాను. ఆ అంకెలన్నీ ఎలా గుర్తుంటాయో నాకు తెలియదు. ఆ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. దానికి సమాధానం మాత్రం నా దగ్గర లేదు. జ్ఞాపకశక్తి అనేది దేవుడిచ్చిన నాకు ఇచ్చిన గొప్ప బహుమతి. ఆ అంశాన్ని ప్రతిబింబించే చిన్న సన్నివేశాన్ని సినిమాలో పెట్టాం.

ప్రస్తుతం తెలుగు తెరపై వస్తున్న ప్రేమకథలతో పోలిస్తే ఈ సినిమాలో ఎలాంటి వైవిధ్యత కనిపిస్తుంది.

మిస్ మ్యాచ్ అనిపించుకునే ఓ జంట కథ ఇది. కుటుంబ పరంగా ఎదురైన అవరోధాల్ని వారు ఏ విధంగా అధిగమించి ఒక్కటయ్యారు? కుస్తీ క్రీడాకారిణి అయిన ప్రియురాలి లక్షసాధనకు ప్రేమికుడు ఎలా అండగా నిలిచాడన్నది ఆకట్టుకుంటుంది. విరామ సన్నివేశాల ముందు వచ్చే మలుపు ఉత్కం పంచుతుంది.

గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన మీ జీవితం హీరోగా ఎలా మలుపుతిరిగింది?

అదే నా జీవితంలో పెద్ద మిస్‌మ్యాచ్(నవ్వుతూ). మ్యాథమెటిక్స్‌లో గిన్నిస్‌బుక్ రికార్డ్ సాధించినా ఇంటర్‌లో మాత్రం బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో డెంటిస్ట్ కోర్సును రెండో ఏడాదితో వదిలేశాను. ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే ఉంది.

‘తొలివూపేమ’లోని ‘ఈ మనసే’ పాటను రీమిక్స్ చేయాలనే ఆలోచన ఎవరిది?

రీమిక్స్ ఆలోచన నాదే. పవన్‌కల్యాణ్‌కు నేను వీరాభిమానిని. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రోజుల్లో హీరోగా మారిన తర్వాత ప్రేమకథతో సినిమా చేస్తే ‘ఈ మనసే’ పాటను నా సినిమాలో రీమిక్స్ చేయాలని నిశ్చయించుకున్నాను. బలవంతంగా ఇరికించినట్లుగా కాకుండా సందర్భానుసారంగానే ఆ పాట సినిమాలో వస్తుంది. ఎలాంటి టెన్షన్స్, ఇబ్బందులు ఉండకూడదని షూటింగ్ చివరలో ఈ పాటను చిత్రీకరించాం. విజయ్ మాస్టర్ నృత్యసారథ్యంలో సింగిల్‌షాట్‌లో 120 మంది సాంకేతిక నిపుణులు, ఆరవై మంది డ్యాన్సర్లపై హైదరాబాద్‌లో విభిన్నంగా చిత్రీకరించాం.పవన్‌కల్యాణ్‌పై నాకున్న అభిమానాన్ని చాటిచెప్పడానికే సినిమాలో పాటను రీమిక్స్ చేశాం.

పవన్‌కల్యాణ్ స్వయంగా రీమిక్స్ పాటను విడుదల చేశారు కదా. పాట విని ఆయన ఏమన్నారు?

పాటను పవన్‌కల్యాణ్ చూసి ఎంజాయ్ చేశారు. విడుదలచేస్తున్న సమయంలో సింగిల్‌షాట్‌లో చిత్రీకరించిన విషయం ఆయనకు చెప్పలేదు. పాట మొత్తం చూసి సింగిల్‌షాట్‌లో చిత్రీకరించిన విషయం గుర్తుపట్టారు. చాలా కష్టపడి పాటతో పాటు సినిమాను చేశారు. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అభినందించారు.

నటుడిగా తొలి సినిమా ‘ఆటగదరాశివ’ నుంచి ఏం నేర్చుకున్నారు.?

చాలా మంది నవతరం హీరోలు ఫైట్స్, పాటలు, రొమాన్స్‌తో కూడిన కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. నేను అలాంటి సినిమా చేస్తే వారిలో ఒకరిగా కలిసిపోయేవాణ్ణి. రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ప్రయత్నించాడని ప్రేక్షకులు అనుకోవాలనే ఆలోచనతో ‘ఆటగదరాశివ’ సినిమా చేశాను. కన్నడ సినిమా ‘రామా రామారే’కు రీమేక్ అది. చక్కటి భావోద్వేగాలతో నటనకు ఆస్కారం ఉన్న కథ కావడంతో ఆ సినిమాలో హీరోగా నటించాను. డీగ్లామర్ రోల్, హీరోయిన్ లేని ఆ సినిమా నటుడిగా చక్కటి ప్రయత్నం చేశాననే పేరును తీసుకొచ్చింది. దర్శకుడు త్రివిక్షికమ్ సినిమా చూసి అభినందించారు. బాగా నటించానని మెచ్చుకున్నారు.

నాన్న శ్రీరాం రచయిత. ఫిలాసఫీపై పలు పుస్తకాలు రాశారు. ఆయన రచనలు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మందిని ప్రభావితం చేశాయి. మా నాన్నగారి ఊరు గద్వాల సమీపంలోని మల్దకల్. అమ్మవాళ్లది జడ్చర్ల.నా పాఠశాల విద్యాభ్యాసం అంతా నిజామాబాద్‌లో సాగింది.

ఐశ్వర్యారాజేష్‌కు పాతిక ముప్పై సినిమాలు చేసిన అనుభవం ఉంది. నాకంటే సీనియర్ హీరోయిన్‌తో పనిచేస్తున్నాననే భయం షూటింగ్ ప్రారంభమైన రెండు, మూడు రోజులు నన్ను వెంటాడింది. ఆ ఆలోచనల్నీ పక్కనపెట్టి నా పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించాను. ఐశ్వర్యారాజేష్‌లో ఉన్న కలుపుగోలుతనం నాలోని భయాన్ని దూరం చేసింది.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

ఈ సినిమా ఫలితాన్ని అనుసరించి తదుపరి చిత్రానిపై నిర్ణయానికి వస్తాను. ‘అర్జున్‌డ్డి’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన గిరీష్‌యాదవ్ చెప్పిన ఓ కథ నన్ను ఆకట్టుకుంటుంది. .

382

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles