అప్పుడు- ఇప్పుడు వినోదం

Thu,November 7, 2019 12:22 AM

టైటిల్ క్యాచీగా ఉంది. చక్కటి సంగీతంతో పాట బాగుంది. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి అని అన్నారు నటుడు సునీల్. సుజన్, తనిష్క్ జంటగా నటించిన చిత్రం అప్పుడు-ఇప్పుడు. యు.కె. ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయరామకృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. చలపతి పువ్వల దర్శకుడు. ఈ చిత్రంలోని మేమింతే..మేమింతే.. అనే పాటను సునీల్ విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మాట్లాడుతూ ఫీల్‌గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రేమ, పెళ్లి బంధాల వల్ల ఓ జంట ఎదుర్కొనే సంఘర్షణ నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్, రాఘవేంద్రరావు విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. సునీల్ మూడవ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు. శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పద్మనావ్ భరశద్వాజ్, సినిమాటోగ్రఫీ:కల్యాణ్ సమి.

195

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles