కోతల రాయుడు వినోదం


Sat,March 23, 2019 11:40 PM

Hero Srikanth About Kothala Rayudu Movie

శ్రీకాంత్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం కోతల రాయుడు. నటాషాదోషి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ దర్శకుడు. సదానంద్ కిషోర్, కోలన్ వెంకటేష్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ శ్రీకాంత్ కెరీర్‌లో ఇప్పటివరకు పోషించనటువంటి వైవిధ్యమైన పాత్రలో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. పూర్తి వినోదాత్మకంగా కొనసాగే ఈ చిత్రంలో వుండే కుటుంబ భావోద్వేగాలు అందర్ని అలరిస్తాయి. తప్పకుండా ఈ చిత్రం శ్రీకాంత్‌కు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా వుంటుంది అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, ప్రాచీసిన్హా, పృథ్వీ, చంద్రమోహన్, సుధ, హేమ, సత్యంరాజేష్, బిత్తిరిసత్తి, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.జె.వసంత్, ఫైట్స్: రియల్ సతీష్, ఆర్ట్: సాయిమణి.

1600

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles