హీరో హీరోయిన్ టీజర్ ఆవిష్కరణ!


Thu,February 14, 2019 12:25 AM

Hero Heroine Official Teaser released

నవీన్‌చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి హీరో హీరోయిన్లుగా అడ్డా ఫేం జీయస్ కార్తీక్ దర్శకత్వంలో స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం హీరో హీరోయిన్. ఏ పైరెటెడ్ లవ్ స్టోరి అనేది క్యాప్షన్. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం సీనియర్ పాత్రికేయులు జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ పైరసీ నేపథ్యంలో కొనసాగే కథ ఇది. సాంకేతిక పెరగడంతో పైరసీ చేయడం, చూడటం తప్పుకాదనే పరిస్థితికి చేరుకున్నాం. ఇది భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారే అవకాశం వుందని మా సినిమా ద్వారా చెబుతున్నాం. ఈ సినిమా ద్వారా పైరసీ వెనక వుండే లోగుట్టు, పైరసీ సంబంధించి సినీ పరిశ్రమలో జరిగే వాస్తవాలు ఇలా అన్ని నిజాలే చెబుతున్నాను. చెప్పాలనుకున్న కథకు కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కించాను. సినిమాలో నవీన్‌చంద్ర పైరసీకి పాల్పడే యువకుడి పాత్రలో కనిపిస్తాడు. అలాంటి వ్యక్తికి ఓ నిర్మాత కూతురికి మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కథ విని సినిమా చూడాలని చాలా మంది హీరోలు అడిగారు. ఇండస్ట్రీవారికి త్వరలో ప్రత్యేకంగా ఓ షో వేయబోతున్నాం.

నిర్మాత నాకు మంచి మిత్రుడు కావడం వల్ల ఏ విషయంలోనూ రాజీపడలేదు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ ఈ కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను నటించిన తొలి సినిమా విడుదలైన రోజే పైరసీ అయింది. అది తెలిసి ఏమీ చేయలేకపోయాను. ఆ తరువాత పెద్ద పెద్ద చిత్రాలు కూడా పైరసీ బారిన పడ్డాయి. పైరసీ చేయడం అంటే నిర్మాతల సొమ్మును దోచుకోవడమే. ట్యాక్సీవాలా విడుదలకు ముందే పైరసీ అయినా ఆ చిత్రాన్ని ఆదరించి ఫ్యాన్స్ తలుచుకుంటే ఎలాంటి పైరసీ సినిమా విజయాన్ని అడ్డుకోలేదని నిరూపించారు. అలా అందరి ఫ్యాన్స్ ముందుకు వస్తే పైరసీని ఆరికట్టేయవచ్చు అన్నారు. పైరసీని ఎలా అరికట్టాలనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. తప్పకుండా మా చిత్రం మంచి కమర్షియల్ విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఎ. రాజు, సురేష్ కొండేటి, గాయత్రి సురేష్ పాల్గొన్నారు.

1218

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles