పైరసీ నేపథ్య ప్రేమకథ


Thu,February 7, 2019 11:41 PM

hero heroine movie first look released

సినిమా పైరసీ నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమకథ హీరో హీరోయిన్.అడ్డా ఫేం జీయస్ కార్తీక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నవీన్‌చంద్ర కథానాయకుడు. గాయత్రి సురేష్, పూజా జవేరి నాయికలు. ఏ పైరెటెడ్ లవ్‌స్టోరీ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ విభిన్న నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. పైరసీ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ లవ్‌స్టోరీలో అన్ని ఎమోషన్స్ వుంటాయి. నవీన్‌చంద్ర పాత్ర ఆకట్టుకునే విధంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. ఎక్కడా రాజీపడకుండా రిచ్‌గా చిత్రాన్ని నిర్మించాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు. నవీన్‌చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి, అభిమన్యు సింగ్, కబీర్‌సింగ్, జయప్రకాష్ రెడ్డి, షేకింగ్ శేషు, రణధీర్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్‌చిక్ బబ్లూ, సారిక రామచంద్రరావు తదితరులు నటిసున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధికి, ఫైట్స్: రియల్ సతీష్, నిర్మాత: భార్గవ్ మన్నె, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: జీయస్ కార్తీక్.

632

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles