మార్చిలో వివాహం!


Thu,February 14, 2019 11:37 PM

hero arya confirms his wedding with actress sayyesha

తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా సైగల్ ప్రేమలో వున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు నిజమే అంటూ గురువారం ప్రేమికుల రోజు సందర్భంగా హీరో ఆర్య ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఓ అందమైన గ్రీటింగ్ కార్డుని, సాయేషాతో తను దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేస్తూ ప్రేమవివాహంపై స్పష్టమైన ప్రకటన చేశారు. మా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మార్చిలో మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండి అని అభిమానులకు వాలంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు. ఆర్య హీరోగా నటించిన గజినికాంత్ చిత్రీకరణ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడింది.

3188
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles