బంగారు బుల్లోడు


Mon,April 8, 2019 12:05 AM

hero allari naresh new movie bangarubullodu

అల్లరి నరేష్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. పి.వి.గిరి దర్శకుడు. ఏటీవి సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రానికి బంగారు బుల్లోడు టైటిల్‌ని ఖరారు చేశారు. పూజా ఝవేరి కథానాయిక. నరేష్ నటిస్తున్న 55వ చిత్రమిది. నిర్మాత మాట్లాడుతూ ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను. జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.

824

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles