దసరాకు హలో గురు..


Wed,July 11, 2018 11:34 PM

Hello Guru Prema Kosame to release on October 18th

రామ్, అనుపమపరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమకోసమే. త్రినాథరావు నక్కిన దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 18న చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కొంత టాకీ పార్ట్, పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. ప్రేమలోని అందమైన భావనలకు దృశ్యరూపంలా ఉంటుంది. ప్రతి సన్నివేశం హృద్యంగా అనిపిస్తుంది. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంట కన్నులపండువగా అనిపిస్తుంది. రామ్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నాం. సంభాషణలు హృదయానికి హత్తుకుంటాయి. మా సంస్థలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్నందించిన దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు స్వరాల్ని సమకూర్చుతున్నారు. మెలోడీ ప్రధానంగా పాటలు అందరిని అలరిస్తాయి. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ కె చక్రవర్తి, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, మాటలు: ప్రసన్నకుమార్, రచనా సహకారం: సాయికృష్ణ.

1576

More News

VIRAL NEWS