కొత్త హవీష్‌ను చూస్తారు!


Wed,June 5, 2019 12:07 AM

Havish starrer Seven to have a worldwide release on June 6

రమేష్‌వర్మ అందించిన కథను నిజార్‌షఫీ అద్భుతంగా దృశ్యమానం చేశాడు. ఆరుగురు అందమైన నాయికలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తారు. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో వినూత్న చిత్రమిది అన్నారు హవీష్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 7. నిజార్ షఫీ దర్శకుడు. రెజీనా, నందితాశ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజిత పొన్నాడ కథానాయికలు. రమేష్‌వర్మ నిర్మాత. అభిషేక్ నామా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నెల 6న ప్రేక్షకులముందుకురానుంది. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హవీష్ మాట్లాడుతూ ఈ కథ విని ఎంతగానో ఎక్సైట్ అయ్యాను. ట్రైలర్ వల్ల సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. చైతన్ భరద్వాజ్ అద్భుతమైన మూడు పాటలిచ్చారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్‌గా అందరిని అలరిస్తుంది అన్నారు. పెయిడ్ ప్రీమియర్లతో ఈ నెల 5న సాయంత్రం మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ సినిమా విడుదలవుతున్నది.

6న రెగ్యులర్ రిలీజ్ ఉంటుంది. రమేష్‌వర్మ కోరగా సినిమా చూశాను. బాగా నచ్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా హక్కుల్ని తీసుకున్నాను. ఈ చిత్రంలో కొత్త హవీష్‌ను చూస్తారు అని అభిషేక్ నామా తెలిపారు. సినిమాలో తాను రమ్య అనే సిటీ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, కథలో కీలకంగా సాగే పాత్రను పోషించడం ఆనందంగా ఉందని నందితాశ్వేత తెలిపింది. నవ్యత మేళవించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని పూజితా పొన్నాడ ఆనందం వ్యక్తం చేసింది. సినిమాలోని తన పాత్ర వైవిధ్యంతో ఆకట్టుకుంటుందని త్రిధా చౌదరి చెప్పింది. పి.శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యుల్లేఖరామన్, వేణు, ధనరాజ్, సత్య తదితరులు చిత్ర తారాగణం.

505

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles