కిల్లర్ హన్సిక


Wed,January 2, 2019 12:39 AM

Hansika The New Year Treat

హన్సిక కథానాయికగా అరంగేట్రం చేసి దాదాపు పదిహేనేళ్లు అవుతోంది. సుదీర్ఘ ప్రయాణంలో గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది ఈ సొగసరి. గత కొంతకాలంగా తమిళ, తెలుగు భాషల్లో హన్సిక నటించిన సినిమాలు పరాజయాలుగా నిలుస్తుండటంతో మూస కథాంశాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తున్నది. తాజా తమిళ చిత్రం మహా లో ప్రతినాయిక పాత్రలో కనిపించబోతున్నది. రకరకాల మారు వేషాలతో అందరిని మోసం చేసే కిల్లర్‌గా హన్సిక పాత్ర ఈ సినిమాలో వినూత్నంగా సాగుతుందని చిత్రబృందం చెబుతున్నది. ఆమె కెరీర్‌లో యాభయ్యవ సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటున్నది. తెలుగులో హన్సిక ఎన్టీఆర్ బయోపిక్‌లో అతిథి పాత్రతో పాటు సందీప్‌కిషన్‌తో మరో సినిమా చేస్తున్నది.

1369

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles