తమిళంలో నిర్మాతగా..


Wed,October 11, 2017 11:49 PM

100-Per-Kaadhal
తెలుగు చిత్రసీమలో సృజనాత్మక కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే దర్శకుల్లో సుకుమార్ ముందువరుసలో నిలుస్తారు. దర్శకుడిగానే కాకుండా కథాబలమున్న చిన్న చిత్రాలతో నిర్మాతగా తన ప్రతిభను చాటుకుంటున్నారాయన. తాజాగా ఆయన నిర్మాతగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 100 % లవ్ తెలుగులో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. నవ్యమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం 100 % కాదల్ పేరుతో తమిళంలో రీమేక్ అవుతున్నది. చంద్రమౌళి దర్శకుడు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్‌కుమార్ ఈ చిత్రంలో కథానాయకుడిగానటిస్తున్నారు. ఈ రీమేక్‌కు సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భువన చంద్రమౌళితో కలిసి ఆయన ఈ రీమేక్‌ను నిర్మిస్తుండటం విశేషం. బుధవారం చెన్నైలో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన సుకుమార్ తొలి సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. సంగీతదర్శకుడు దేవిశ్రీప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు భారతీరాజా గౌరవ దర్శకత్వం వహించారు. అర్జున్‌రెడ్డి చిత్రంలో సహజ అభినయంతో ఆకట్టుకున్న షాలిని పాండే ఈ రీమేక్‌తో తమిళంలో అరంగేట్రం చేస్తున్నది.

459

More News

VIRAL NEWS