గులేబకావళి రహస్యం


Wed,March 14, 2018 12:07 AM

Gulaebaghavali Movie Review Trailer Show timings at Times of India

Prabhu-Deva.jpg
ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాత మాట్లాడుతూ తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా వుంటుంది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. ప్రభుదేవా నృత్యాలు, నటన హైలైట్‌గా నిలుస్తాయి అని తెలిపారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్శకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

1318

More News

VIRAL NEWS