సంగీతభరిత ప్రేమకథ


Mon,July 8, 2019 11:46 PM

Guitar in the coming months

ఉమాపతి, రేష్మా జంటగా ఆర్.ఇన్బ శేఖర్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన గిటార్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఐమిస్‌యూ ఉపశీర్షిక. యమ్‌ఆర్‌ఆర్ మూవీస్ పతాకంపై వాసుపల్లి బ్రహ్మ సమర్పణలో నిర్మాత యం.రవిశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఇమాన్ అందించిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా వుంటుంది. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: వెన్నెలకంటి, సహ నిర్మాత: వానపల్లి లక్ష్మి.

319

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles