ప్రియుడి కోసం పోరాటం


Sat,July 6, 2019 12:51 AM

Grand Ole Opry unveils emotional new mini movie

చెన్నై సోయగం త్రిష కథాంశాల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిస్తున్నది. మహిళా ఇతివృత్తాల్లో తన ప్రత్యేకతను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది. తాజాగా ఈ సుందరి తమిళంలో ఓ యాక్షన్ సినిమాలో నటిస్తోంది. ఇందులో త్రిష మీద కొన్ని పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. గర్జనై పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సుందర్‌బాలు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో తన పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటుందని, తన పరిచయ సన్నివేశం ఫైట్ సీన్‌తో మొదలవుతుందని చెప్పింది త్రిష. ఆమె మాట్లాడుతూ సాధారణంగా హీరోల ఇంట్రడక్షన్ సీన్స్‌ను యాక్షన్ నేపథ్యంలో రూపొందిస్తారు. కానీ ఈ సినిమాలో నా పరిచయ సన్నివేశం భారీ యాక్షన్ హంగులతో ఉంటుంది.

ఒక్క రాత్రిలో జరిగే కథతో దర్శకుడు వినూత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని చెప్పింది. ఈ చిత్రంలో త్రిష పాశ్చాత్య డ్యాన్సర్ పాత్రలో నటిస్తున్నదట. ప్రియుడితో కలిసి భారతదేశ విహారానికి వచ్చిన ఆమెకు ఇక్కడ భయానక పరిస్థితులు ఎదురవుతాయి. వాటి నుంచి తన ప్రియుడిని రక్షించుకునే ధైర్యవంతురాలైన యువతిగా త్రిష పాత్ర చిత్రణ పవర్‌ఫుల్‌గా సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. త్రిషపై చిత్రీకరించిన జీప్ ఛేజింగ్ సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.

1761

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles