ఐకాన్ ఆఫ్ గోల్డెన్‌జూబ్లీ అవార్డ్

Sun,November 3, 2019 12:13 AM

సూపర్‌స్టార్ రజనీకాంత్ అరుదైన పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆయనను స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. గడచిన కొన్ని దశాబ్దాలుగా భారతీయ చలన చిత్రసీమకు రజనీకాంత్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించబోవడం సంతోషంగా ఉందని ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల భారత ప్రభుత్వానికి రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ అవార్డును రజనీకాంత్‌కు ప్రదానం చేస్తారు. ప్రస్తుతం రజనీకాంత్ దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 15న ప్రేక్షకులముందుకు తీసుకొస్తారు.

245

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles