'గౌతమ్‌నంద' గీతాలు


Mon,July 17, 2017 10:48 PM

GOUTHAM-NANDA
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గౌతమ్‌నంద. సంపత్‌నంది దర్శకుడు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. హన్సిక, కేథరిన్ కథానాయికలు. తమన్ స్వరపరచిన చిత్ర గీతాల్ని ఆదివారం విడుదల చేశారు. ఆడియో సీడీని గోపీచంద్ ఆవిష్కరించారు. ప్రచార చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ సంపత్‌నంది చెప్పిన విధంగానే చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక్క డైలాగ్ కూడా మార్చలేదు. సంపత్‌నందితో మరో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాను. చాలా కాలం తర్వాత నాకు సంతృప్తినిచ్చిన చిత్రమిది అన్నారు. రమణ మహర్షి తాత్వికత ఆధారంగా ఈ చిత్ర కథ తయారు చేసుకున్నాను. ఆర్థికంగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో అంచనా వేయలేను కానీ కథాపరంగా పది ఉత్తమ చిత్రాల వరుసలో నిలుస్తుంది. కథానుగుణంగా తమన్ వినూత్నమైన బాణీలందించారు అని దర్శకుడు సంపత్‌నంది చెప్పారు. ట్రైలర్‌ని చూస్తుంటే ఈ సినిమా విజయం తథ్యమనే భావన కలుగుతున్నదని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. తమన్ మాట్లాడుతూ ఇందులో పోరాట ఘట్టాలు ఎక్కువగా వుండటం వల్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్కోప్ దొరికింది. సంపత్‌నంది తనదైన శైలిలో చిత్రాన్ని గొప్పగా తీర్చిదిద్దారు అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ తొలుత నిర్ధిష్టమైన బడ్జెట్‌లో చిత్రాన్ని తీయాలనుకున్నాం. అయితే కొంత భాగం షూటింగ్ చేశాక బడ్జెట్‌కు ఎలాంటి పరిధులు పెట్టుకోవద్దని నిర్ణయించుకున్నాం. కథపై పూర్తి విశ్వాసంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. సంపత్‌నంది ఆకలిని తీర్చే చిత్రమిదని, ఆసక్తిని కలిగించే కథ, కథనాలతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారని గీత రచయిత రామజోగయ్యశాస్త్రి చెప్పారు. నా అభిమాన సంగీత దర్శకుడు తమన్. సినిమాలోని ప్రతి పాట కొత్తగా వుంది అని కథానాయిక కేథరిన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో రామ్‌లక్ష్మణ్, సౌందర్‌రాజన్, బ్రహ్మకడలి తదితరులు పాల్గొన్నారు.

489

More News

VIRAL NEWS