లక్ష్యసాధన కోసం!


Tue,June 12, 2018 11:32 PM

gopichands Pantham movie release on july 5th

gopi-chand
అవినీతి రహిత సమాజం కోసం ఓ యువకుడు పట్టిన పంతం నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తన లక్ష్య సాధన కోసం ఓ యువకుడు ఏం చేశాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? చివరికి తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అన్నారు కె.చక్రవర్తి. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం పంతం. ఫర్ ఎ కాజ్ అని ఉపశీర్షిక. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ యు.కెలో పాటలు చిత్రీకరించాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. కమర్షియల్ అంశాల్ని జోడించి చక్కని సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హీరో గోపీచంద్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని సరికొత్త పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. ఆయన పాత్ర చిత్రణ, లుక్ కొత్తగా వుంటాయి. అన్ని వర్గాల వారిని అలరించే అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. చిత్రాన్ని జూలై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు. పృథ్వీ, జయప్రకాష్‌రెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రమేష్‌రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, స్క్రీన్‌ప్లే: కె. చక్రవర్తి, బాబీ, సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల.

2134

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles