చాణక్యతో ఆ ప్రేమను తిరిగిస్తాను

Tue,October 1, 2019 12:07 AM

షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించే సమయంలో ప్రమాదం జరిగి గాయపడ్డాను. అభిమానుల ప్రోత్సాహం, ప్రేమ వల్లే ఆ ఘటన నుంచి కోలుకొని వేదికపై నిలబడి మాట్లాడగలుగుతున్నాను. వారు నాపై చూపించిన ప్రేమను చాణక్య సినిమాతో తిరిగి ఇస్తాను అని అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం చాణక్య. తిరు దర్శకుడు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలు. ఈ నెల 5న విడుదలకానుంది. ఆదివారం వైజాగ్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ నా నుంచి అభిమానులు కోరుకునే అన్ని హంగులున్న చిత్రమిది. అద్భుతమైన యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్‌లతో దర్శకుడు తిరు హీరోయిజాన్ని పతాకస్థాయిలో ఆవిష్కరించారు. మంచి సినిమా తీయాలనే తపనతో అనిల్ సుంకర ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు అని పేర్కొన్నారు.


అనిల్ సుంకర మాట్లాడుతూ గోపీచంద్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. దర్శకుడు తిరు ఆసక్తికరమైన మలుపులతో ఉత్కంఠభరితంగా సినిమాను తెరకెక్కించారు అని చెప్పారు. స్పై థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిదని, దేశభక్తి భావనను పెంపొందిస్తుందని సంభాషణల రచయిత అబ్బూరి రవి పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ గోపీచంద్ ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వెట్రి ఛాయాగ్రహణం, అబ్బూరి రవి సంభాషణలు, విశాల్‌చంద్రశేఖర్, శ్రీచరణ్ బాణీలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని అలరిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామజోగయ్యశాస్త్రి, ఎంవీవీ సత్యనారాయణ, విశాల్‌చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

543

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles