గోపీచంద్‌ కొత్త చిత్రం


Sat,September 14, 2019 12:32 AM

Gopichand starts shooting for his next film with Binu Subramanyam

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బిను సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ‘ఈ చిత్రాన్ని ఇండియా, నేపాల్‌, కాంబోడియా, థాయ్‌లాండ్‌లో చిత్రీకరిస్తాం. ‘సాహసం’ తర్వాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాణంలో గోపీచంద్‌ నటిస్తున్న చిత్రమిది. ఆయన పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన కథానాయిక, ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురువ్‌, సంగీతం: మణిశర్మ, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సి.హెచ్‌.నరసింహాచారి, దర్శకత్వం: బిను సుబ్రమణ్యం.

349

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles