ద్వితీయ కలయిక

Thu,September 19, 2019 11:08 PM

గోపీచంద్ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో భారీ చిత్రం తెరకెక్కబోతున్నది. శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. అత్యుత్తమ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అని నిర్మా తెలిపారు. గోపీచంద్-సంపత్‌నంది కలయికలో గతంలో గౌతమ్‌నంద సినిమా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు ఈ దర్శకహీరోల కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రానికి సమర్పణ: పవన్‌కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది

674

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles