‘శివ’తరహాలో స్ఫూర్తినిచ్చింది!


Thu,August 9, 2018 11:30 PM

Goodachari Movie Success Meet

గూఢచారి చిత్రానికి అందరు అద్భుతంగా పనిచేశారు. భవిష్యత్తులో మీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను. లేకుంటే నేను వెనుకబడిపోతాను. సినిమా చూస్తున్నంత సేపు ఎలా చేశారా? అని చూశాను. బడ్జెట్ గురించి తెలుసుకున్న తరువాత ఎలా సాధ్యమైందని ఆలోచించాను అన్నారు నాగార్జున. అడివి శేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గూఢచారి. శశికిరణ్ తిక్క దర్శకుడు. శోభితా ధూళిపాళ్ల కథానాయిక. అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని చూశాక అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాకు తెలియని లొకేషన్స్ వున్నాయా అనిపించింది. 1989లో వచ్చిన శివ దర్శకనిర్మాతలకు ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో గూఢచారి కూడా అలాంటి స్ఫూర్తినే కలిగించింది అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ మా కలను, సినిమాను ప్రపంచానికి చూపించిన అనిల్ సుంకరకు కృతజ్ఞతలు. శోభిత నుంచి సుప్రియ వరకు అంతా అద్భుతంగా నటించారు. ఈ చిత్ర విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రియ, శశికిరణ్ తిక్క, అనిల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.

1383

More News

VIRAL NEWS