నవ ప్రపంచం కోసం..


Sat,May 18, 2019 11:51 PM

god of gods movie audio released by dil raju

మనవల్ల ఎవరికీ మంచి జరగకపోయినా ఫర్వాలేదు. కానీ చెడు మాత్రం అస్సలు జరగకూడదు అనే సిద్ధాంతాన్ని నేను బలంగా విశ్వసిస్తాను. నా సినిమాల్లో కూడా మంచి చూపించే ప్రయత్నం చేస్తాను అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. డివైన్ విజన్ ఇంటర్‌నేషనల్ పతాకంపై ఫిల్మ్ డివిజన్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ సమర్పిస్తున్న చిత్రం గాడ్ ఆఫ్ గాడ్స్. వెంకటేష్ గోపాల్ దర్శకుడు. జగ్‌మోహన్ గర్గ్, ఐఎంఎస్ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజస్వి మనోజ్ఞ, త్రియుగమంత్రి, రాజసింహవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చిలో హిందీలో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ప్రేక్షకులముందకురానుంది. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో దిల్‌రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక సంస్థ రూపొందించిన ఈ చిత్ర ఆడియో వేడుకు అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమా విషయంలో ఎలాంటి సహాయసహకారాలైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. సర్వమత సామరస్యం, వసుదైక కుటుంబం, శాంతి, ప్రేమ, విలువలతో కూడిన నవ ప్రపంచపు పునరుద్ధరణ మహాకార్యం వంటి అంశాల్ని తీసుకొని మనోరంజక ఆధ్యాత్మిక చిత్రంగా రూపొందించామని, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల్ని చూపించామని దర్శకుడు తెలిపారు. మెక్సికో, అమెరికా, ముంబయి, చెన్నై, యు.కెలో చిత్రీకరణ జరిపామని నిర్మాతలు చెప్పారు.

679

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles