చిన్న సినిమాలకు వరం


Tue,September 19, 2017 10:53 PM

gift for small films says p Rama Krishna goud

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం చక్కటి సహకారాన్ని అందిస్తున్నదని, సింగిల్ విండో విధానం, ఐదవ ఆటకు అనుమతులు మంజూరు చేస్తూ మంచి నిర్ణయాల్ని తీసుకున్నదన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. మంగళవారం హైదరాబాద్‌లో ఆర్.కె. గౌడ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఐదవ ఆట వలన చిన్న సినిమాలు బతుకుతాయని, థియేటర్ల లభించకపోవడంతో విడుదలకు నోచుకొని మూడు వందలకు పైగా సినిమాల్ని ఐదవ ఆట ద్వారా ప్రదర్శించేందుకు అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. సింగిల్ విండో విధానాన్ని దసరా నుంచి అమలులోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందని చెప్పారు. డిజిటల్, థియేటర్స్ లీజు విధానాల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కృషిచేస్తున్నదని ఆర్.కె. గౌడ్ చెప్పారు.
ramakrishnagoud

231

More News

VIRAL NEWS

Featured Articles