ఉస్మానియా యోధుడి గాథ

Thu,January 17, 2019 10:55 PM

ధైర్యానికి, సాహసానికి మారుపేరుగా చరిత్రలో నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. జీవన్‌రెడ్డి (దళం ఫేమ్) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైక్ టీవీ, త్రీ లైన్స్ సినిమా పతాకాలపై అప్పిరెడ్డి, దామురెడ్డి కొసనం నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. 1970 కాలం నాటి వస్త్రధారణలో చేతిలో పుస్తకాలతో నడిచి వెళ్తున్న జార్జిరెడ్డి లుక్ ఆకట్టుకుంటున్నది. నిర్మాతలు మాట్లాడుతూ సమసమాజ స్థాపనే ధ్యేయంగా పోరాటాన్ని సాగించారు జార్జిరెడ్డి. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. చిన్న వయసులోనే ప్రత్యర్థుల చేతిలో ఉస్మానియా యూనివర్సిటీలో హత్యకు గురయ్యారు. జార్జిరెడ్డి మరణించినా ఆయన ఆశయం మాత్రం బతికి ఉంటుందనే కథాంశంతో స్ఫూర్తిదాయకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. చరిత్ర మరచిన పోరాట యోధుడి గాథ ఇది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో సినిమాను విడుదలచేస్తాం. త్వరలో ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు నటీనటుల వివరాల్ని వెల్లడిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుధాకర్‌రెడ్డి యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్.

953

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles