గ్యాంగ్‌లీడర్ ఆగమనం


Sat,May 18, 2019 12:23 AM

gangliter Movie Release August 30

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నాని గ్యాంగ్‌లీడర్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎం) నిర్మిస్తున్నారు. కార్తికేయ(ఆర్‌ఎక్స్100 ఫేమ్) కీలక పాత్రధారి. ఆగస్టు 30న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ మా సంస్థలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రమిది. ఈ నెల 14 నుంచి శంషాబాద్‌లో మూడో షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నాం. జూన్ 30తో షూటింగ్ పూర్తవుతుంది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ తెలుగు తెరపై ఇప్పటివరకు రాని సరికొత్త కథాంశమిది. కుటుంబ విలువలకు ఓ ఆసక్తికరమైన పాయింట్‌ను జోడించి రూపొందిస్తున్నాం.

అదేమిటన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అని చెప్పారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెలకిషోర్, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్, మాటలు: వెంకీ, డార్లింగ్‌స్వామి, కళా దర్శకత్వం: రామ్‌కుమార్, ఎడిటింగ్:నవీన్ నూలి.

2234

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles