జీవితాంతం రుణపడి ఉంటా!


Thu,January 18, 2018 11:19 PM

Gang Telugu Movie Success Meet

suriya
సంక్రాంతి పండుగకు విడుదలైన పెద్ద సినిమాలతో సమానంగా మా చిత్రానికి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. మంచి సినిమా చేశారని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. పన్నెండేళ్లుగా నాపై ప్రేమాభిమానాల్ని కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం గ్యాంగ్. విఘ్నేష్ శివన్ దర్శకుడు. కీర్తిసురేష్, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించారు. యు.వి. క్రియేషన్స్ సమర్పణలో స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ శివపుత్రుడు, వీడొక్కడే, సూర్య సన్నాఫ్ కృష్ణన్ తర్వాత సాధారణ యువకుడి పాత్రలో నేను కనిపించిన చిత్రమిది. వినోదం మిళితమైన నా పాత్ర అందరికి నచ్చింది. పొగ, మందు తాగే సన్నివేశాలకు తావు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు విఘ్నేష్‌శివన్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. తొలిసారి ఈ సినిమాలో నా పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ఇకపై ప్రతి సినిమాకు నా సొంత గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాను. కుటుంబానికి దూరంగా సంక్రాంతిని తెలుగు ప్రేక్షకుల మధ్య జరుపుకోవడం కొత్త అనుభూతిని పంచింది అని అన్నారు. దర్శకుడిగా తన మూడో చిత్రమిదని, గత సినిమాలకు మించి పెద్ద విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని, స్ట్రెయిట్ సినిమా తరహాలో తెలుగు ప్రేక్షకులు గ్యాంగ్‌ను ఆదరిస్తున్నారని దర్శకుడు విఘ్నేష్‌శివన్ పేర్కొన్నారు.

1162

More News

VIRAL NEWS