చిరు పుట్టినరోజున..


Sat,June 8, 2019 11:53 PM

gang leader released august 22

మోహన్‌కృష్ణ, హరిణిరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్‌లీడర్. మళ్ళీ మొదలవుతుంది రచ్చ అని ఉపశీర్షిక. సీహెచ్ రవి కిషోర్ బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనీషా ఆర్ట్స్ అధినేతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్, మోహన్‌పోస్టర్‌లను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు మోహన్‌కృష్ణ మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్, మోషన్‌పోస్టర్‌ను విడుదల చేయడం సంతోషంగా వుంది. తప్పకుండా చిత్రం మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్‌లీడర్‌లా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఆయన పుట్టినరోజు నాడు ఆగస్టు 22న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. సుమన్, తనికెళ్లభరణి, రంగస్థలం మహేష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మురళి, ఎడిటర్: నందమూరి హరి.

2497

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles